శ్రీవారిని దర్శించుకున్న పీఎం మోదీ,గవర్నర్ నరసింహన్, సీఎం జగన్
9 Jun, 2019 19:48 IST
తిరుమల : భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం శ్రీవారిని దర్శించుకున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో తిరుపతికి చేరుకున్న మోదీ..అక్కడ ప్రజా ధన్యవాద సభలో పాల్గొన్నారు. అనంతరం తిరుమలకు చేరుకున్న మోదీకి శ్రీవారి ఆలయం ఎదుట ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, టీటీడీ ఈవో అనీల్‌కుమార్ సింఘాల్, ఇతర అధికారులు స్వాగతం పలికారు. టీటీడీ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికి మహాద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారిని దర్శించుకున్నారు.