ప్రభుత్వ విప్‌ పిన్నెళ్లిపై హత్యాయత్నం

7 Jan, 2020 13:23 IST


గుంటూరు: ఉద్యమం ముసుగులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గుండా గిరి చేస్తున్నారు. ప్రభుత్వ విప్‌ పిన్నెళ్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నానికి తెగబడ్డారు. గుంటూరు చిన్నకాకాని వద్ద ఎమ్మెల్యే పిన్నెళ్లి కాన్వాయ్‌పై రైతులు, సామాన్య ప్రజల ముసుగులో తెలుగుదేశం పార్టీ నాయకులు రాళ్ల దాడి చేశారు. కాజా టోల్‌గేట్‌ వద్ద కారుపై రాళ్లు రువ్వడమే కాకుండా సెక్యూరిటీ సిబ్బందిపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. రాళ్ల దాడిలో ప్రభుత్వ విప్‌ పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.