అంబేద్కర్, మహాత్మాగాంధీ ఆశయాలకు అనుగుణంగా సీఎం వైయస్ జగన్ పాలన
1 May, 2021 17:19 IST
విజయవాడ: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, జాతిపిత మహాత్మాగాంధీ ఆశయాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలన సాగుతుందని వైయస్ఆర్‌సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు, ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ పుసూరు గౌతంరెడ్డి అన్నారు. విజయవాడలోని సత్యనారాయణపురంలో వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న గౌతంరెడ్డి మాట్లాడుతూ..సీఎం వైయస్ జగన్ రాష్ట్రంలోని కార్మికులకు అండగా నిలిచారని తెలిపారు. ప్రజల గుమ్మం వద్దకే సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులకు రూ.16 వేలు ఇచ్చిన ఘనత సీఎం వైయస్ జగన్‌కే దక్కుతుందన్నారు.