ఎంపీ మిథున్‌రెడ్డితో పెద్దిరెడ్డి ములాఖత్
తూర్పుగోదావరి జిల్లా: అక్రమ కేసులో అరెస్టు అయి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్‌లో ఉన్న ఎంపీ మిథున్‌రెడ్డిని ములాఖత్‌లో ఆయన తండ్రి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పలువురు వైయస్ఆర్‌సీపీ నేతలు తలశిల రఘురాం, జక్కంపూడి రాజా కలిశారు. అనంతరం పార్టీ నేతలు మీడియాతో మాట్లాడారు.
జక్కంపూడి రాజా కామెంట్స్...
ప్రభుత్వం ప్రతిపక్షాలను అణగదొక్కే ప్రయత్నంలో ఉంది
సమయం మొత్తం దీనికోసం వెచ్చిస్తున్నారు..
పెద్దిరెడ్డి కుటుంబం వేలమందికి ఉపాధి కల్పిస్తుంది
వారిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు
వైయస్ జగన్‌కు అనుబంధంగా ఉన్నారనే కారణంతోనే వారిని తీవ్రంగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు..
వైయస్ జగన్ తో ఉన్న నేతలను వేధించే ప్రయత్నం దారుణంగా జరుగుతోంది
రాష్ట్రంలో ఆటవిక పాలన కొనసాగుతుంది
ప్రజాస్వామ్యంలో కాదు అడవిలో ఉన్నా మనే భావన కలుగుతుంది
పేదలకు మేలు చేయాలన ఆలోచనతోనే పెద్దిరెడ్డి కుటుంబం పనిచేస్తుంది
ఇప్పుడు పాపాలు చేసిన వారు భవిష్యత్తులో కుక్క చావు చస్తారు
చంద్రబాబు జీవితమంతా క్రిమినల్ మైండ్ తోనే సాగింది
చంద్రబాబు రాజకీయ ప్రస్థానం సారా తో మొదలైంది...
అక్రమ సంపాదన లిక్కర్ తోనే జరిగింది
చంద్రబాబు కచ్చితంగా దేవుడు శిక్షిస్తాడు...
మాజీ ఎంపీ వంగా గీత కామెంట్స్..
ప్రభుత్వం వచ్చి ఏడాది గడిచినా ఏ వర్గం పైనా ప్రభుత్వానికి శ్రద్ధ లేదు
మహిళలపై మానభంగాలు కిడ్నాపులతోనే రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు
కక్ష సాధింపు దారుణంగా జరుగుతోంది
అక్రమ కేసులు పెట్టండమే లక్ష్యంగా రాష్ట్రం నడుస్తుంది అంబేద్కర్ రాజ్యాంగం నడవటం లేదు
ఉద్యోగులను పావులుగా వాడుకుంటున్నారు
జర్నలిస్టులను అరెస్టు చేసినప్పుడు పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను కూడా వెనక్కి పంపిన సందర్భాలు ఉన్నాయి
మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం
మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ కామెంట్స్..
గడచిన 15 నెలల కాలంలో తాను ఇచ్చిన వాగ్దానాలు ప్రభుత్వం అమలు చేయలేకపోయింది
ప్రజల దృష్టి మరల్చటానికి ప్రతిపక్ష నేతలను అక్రమ అరెస్టులు చేస్తున్నారు
అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం
నా కుమారుణ్ణి కూడా అక్రమంగా అరెస్టు చేసి 27 రోజులు అన్యాయంగా జైల్లో పెట్టారు
మిథున్ రెడ్డి కడిగిన ముత్యంలా బయటికి వస్తారు
చిర్ల జగ్గరెడ్డి మాజీ ఎమ్మెల్యే కామెంట్స్..
- మిథున్ రెడ్డి కుటుంబాన్ని పాతాళానికి తొక్కేందుకు చేసిన ప్రయత్నమే ఈ అక్రమ అరెస్టు
- దీనికి సంబంధించి స్క్రీన్ ప్లే డైరెక్షన్ నారా చంద్రబాబుదే
- పోలీసు ఉన్నతాధికారులు ఈ వ్యవహారాన్ని గమనించండి
- రాజకీయ నేతల చేతిలో పావులుగా మారొద్దు
- చంద్రబాబు మెప్పుకోసమే మీరు అక్రమ అరెస్టులు చేస్తున్నారు
- ఫామ్ హౌస్ లో దొరికిన డబ్బు చంద్రబాబుదే...
- వెంకటేష్ నాయుడు చంద్రబాబు వెనుక ఉండి అనేక అక్రమాలకు పాల్పడుతున్నారు
- 11 కోట్ల రూపాయలు చూపించారు కోర్టు మొటికాయలు వేసింది.. అధికారుల సిగ్గుపడాలి..
- ప్రొసీజర్ డీవియేట్ అయితే అధికారులు కూడా శిక్షార్హులవుతారు