పేర్ని నాని కుటుంబంపై కూటమి సర్కార్ కక్షసాధింపు
1 Jan, 2025 15:49 IST
మచిలీపట్నం: మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని కుటుంబంపై కూటమి సర్కార్ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. రాజకీయ కక్షసాధింపు కోసం మహిళను అవమానించేలా చర్యలు చేపట్టడం పలు విమర్శలకు తావిస్తోంది. రేషన్ బియ్యం మాయం కేసులో బుధవారం మరోసారి పేర్ని నాని సతీమణి జయసుధకు పోలీసుల నోటీసులు అందించారు. కేసు విచారణలో భాగంగా బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆర్‌పేట పోలీస్ స్టేషన్‌కు రావాలని నోటీసులలో పేర్కొన్నారు. దీంతో విచారణ నిమిత్తం ఆమె బందర్ తాలుకా పోలీసు స్టేషన్‌కు తన తరఫున న్యాయవాదులతో కలిసి వెళ్లారు. కాగా, ఈ కేసులో జయసుధకు ఇప్పటికే కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.