మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి పార్టీ నేతల పరామర్శ
16 Aug, 2025 14:14 IST
వైయస్ఆర్ జిల్లా: జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మూలె సుధీర్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతుండటంతో శనివారం వైయస్ఆర్‌సీపీ నేతలు పలువురు పరామర్శించారు. వైయస్ఆర్ జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, తదితరులు సుధీర్‌రెడ్డి స్వగ్రామం నిడిజీవ్వి కి వెళ్లి ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. సుధీర్‌రెడ్డి యోగక్షేమాలు తెలుసుకొని, ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనారోగ్యం నుంచి త్వరితగతిన కోలుకోవాలంటూ రవీంద్రనాథ్‌రెడ్డి ఆకాంక్షించారు.