సీఎం వైయస్ జగన్ ని కలిసిన పరిమళ్ నత్వానీ
10 Mar, 2020 18:47 IST

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ నుంచి వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికైన పరిమళ్ నత్వానీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రితో భేటీ అయిన నత్వానీ తనకు రాజ్యసభ సీటు ఇచ్చినందుకు వైయస్ జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం పరిమళ్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పారు. రాష్ట్రాభివృద్ధి విషయమై మళ్లీ సీఎం వైయస్ జగన్ ని కలిసి చర్చిస్తానని అన్నారు. కాగా, రాజ్యసభ టికెట్లు పొందిన పరిమళ్ నత్వానీ సహా పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, అయోథ్య రామిరెడ్డి లు రేపు తమ నామినేషన్లు దాఖలు చేయనున్నారు.