ఒంటిమిట్ట సీతారామ కళ్యాణ మహోత్సవానికి సీఎం వైయస్ జగన్కు ఆహ్వానం
27 Mar, 2023 11:26 IST
తాడేపల్లి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవానికి హాజరు కావాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ఆహ్వాన పత్రిక అందించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి సీఎం వైయస్ జగన్ను కలిసి ఆహ్వన శుభపత్రికను అందజేశారు. ముఖ్యమంత్రికి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి తీర్ధ ప్రసాదాలు టీటీడీ ఛైర్మన్, ఈవో అందజేశారు. ఏప్రిల్ 5 వ తేది రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం జరుగుతుందని, ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 09 వరకు ఒంటిమిట్టలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వారు ముఖ్యమంత్రి వైయస్ జగన్కు వివరించారు.