సర్‌పై అత్యంత అప్రమత్తంగా ఉండాలి 

16 Jun, 2026 16:43 IST

తాడేపల్లి:  ఓట్ల ప్రత్యేక సమగ్ర సవరణ ( సర్‌)పై నియోజకవర్గాల్లోని కో-ఆర్డినేటర్లు, రీజనల్‌ ఇన్‌ఛార్జిలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశించారు. సర్‌ ప్రక్రియ జరుగుతున్న తీరుపై ప్రతిరోజూ సమీక్ష చేయాలని, ఎక్కడైనా తప్పులు జరుగుతున్నాయని తెలిసిన వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయలని, అప్పటికీ సమస్య పరిష్కారంకాకపోతే వెంటనే పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకు రావాలన్నారు.  వచ్చే నాలుగు వారాలు అత్యంత కీలకమని, సర్‌ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వద్దన్నారు.  సర్‌ ప్రక్రియలో ఒక్కసారి ఓటు తొలగించిన తర్వాత దాన్ని తిరిగి చేర్పించాలంటే అత్యంత కష్టమవుతుందన్నారు. ప్రతి నియోకవర్గ సమన్వయకర్త దీన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నారు. మంగళవారం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో పార్టీ సీనియర్‌ నాయకులతో శ్రీ జగన్‌ సమావేశమయ్యారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు, తన అధికార దుర్వినియోగంతో ఏదోరకంగా వైయ‌స్ఆర్‌సీపీకి చెందిన ఓట్లను తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, బూత్‌కు కనీసంగా 50 ఓట్లు తొలగించాలని చూస్తున్నారన్నారు. గిమ్మిక్కులతో ఓట్లు తొలగించే తప్పుడు పనుల్లో చంద్రబాబు ఆరితేరిన వ్యక్తని, వైయ‌స్ఆర్‌సీపీ కోఆర్డినేటర్లు, బూత్‌లెవల్‌ ఏజెంట్లు దీన్ని అడ్డుకోవాలని, ప్రతి ఓటునూ కాపాడుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న సర్‌ ప్రక్రియపై ప్రతి అంశంలోనూ అప్రమత్తత, నిరంతర సమీక్షలు నిర్వహించాలని వైయస్‌.జగన్‌ ఆదేశించారు.