ప్రకాశం జిల్లాలో కరోనా కేసులు 'జీరో'
16 May, 2020 16:52 IST
ప్రకాశం: ప్రకాశం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల అంకె జీరో అయ్యింది. జిల్లా వ్యాప్తంగా 63 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, నేటితో మొత్తం బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాని జిల్లాగా ప్రకాశం జిల్లా రికార్డులకెక్కింది. జిల్లాలో 20 వేలకు పైగా శాంపిల్ సేకరిస్తే దాదాపు 19 వేలకు పైగా కరోనా నెగిటివ్‌గా తేలింది. 63 మంది పాజిటివ్‌గా నిర్ధారణ అయితే మరో వెయ్యి కేసుల వరకు ఫలితాలు రావాల్సి ఉంది. జిల్లా వైద్య బృందం, యంత్రాంగం కృషి ఫలితంగానే ప్రకాశం జిల్లా కరోనా కట్టడిలో ముందుందని రిమ్స్ సూపరిండెంట్ డాక్టర్ శ్రీరాములు తెలిపారు.