న‌వంబ‌ర్ 2న స్కూళ్ల పునఃప్రారంభం

29 Sep, 2020 14:12 IST

తాడేప‌ల్లి:ప‌్ర‌స్తుత ప‌రిస్థితుల దృష్ట్యా ఏపీలో స్కూళ్ల పునః ప్రారంభం వాయిదా ప‌డింది. అక్టోబ‌ర్ 5న స్కూళ్లు ప్రారంభించాల‌ని ఇదివ‌ర‌కే నిర్ణ‌యం తీసుకోగా, ఆ నిర్ణ‌యాన్ని వాయిదా వేస్తూ న‌వంబ‌ర్ 2న పాఠ‌శాల‌లు పునఃప్రారంభించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఇవాళ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ క‌లెక్ట‌ర్ల‌తో నాడు-నేడు, స్పంద‌న కార్య‌క్ర‌మాల‌పై స‌మీక్ష నిర్వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా స్కూళ్ల పునఃప్రారంభంపై చ‌ర్చించారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల దృష్ట్యా వాయిదా వేయాల‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించారు. అలాగే అక్టోబ‌ర్ 5న జ‌గ‌న‌న్న విద్యా కానుక అందించాల‌ని, అక్టోబ‌ర్‌లోగా విద్యార్థులు యూనిఫాం కుట్టించుకొని స్కూళ్ల‌కు సిద్ధ‌మ‌వుతార‌ని సూచించారు.