ఎన్ఎన్ పి తాండాలో 'గడప గడపకు మన ప్రభుత్వం'
28 Oct, 2022 12:20 IST
అనంతపురం: ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూరు మండలం ఎన్ఎన్ పి తాండా గ్రామంలో శుక్రవారం 'గడపగడపకు మన ప్రభుత్వం' కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి హాజరయ్యారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందు కృషి చేస్తామని విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు సక్రమంగా అందుతున్నాయ లేదా అని ఆయన ఆరా తీశారు. ప్రజలు తెలిపిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని వివిధ శాఖల అధికారులకు ఆదేశాలు ఇస్తున్నామని తెలిపారు.