నిరక్షరాస్యతను అధిగమించేందుకు ప్రణాళికలు 

13 Sep, 2019 15:56 IST

అమరావతి: నిరక్షరాస్యతను అధిగమించేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. నీతి అయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌కుమార్‌తో సీఎం వైయస్‌ జగన్‌ ఇవాళ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయనతో సీఎం చర్చించారు. తొలి దశలో 15 వేళ స్కూళ్లలో  9 రకాల కనీస సదుపాయాలు కల్పిస్తున్నామని, వచ్చే ఏడాది నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్‌ మీడియం, ఆ తరువాత సంవత్సరం నుంచి 9, 10వ తరగతుల్లో ఇంగ్లీష్‌ మీడియం అమలు చేస్తామని చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం నాణ్యత పెంచుతున్నామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తెలిపారు.