సీఎంను కలిసిన నీతి ఆయోగ్ వైస్ చైర్మన్
1 Dec, 2021 13:48 IST
తాడేపల్లి: నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని సీఎం నివాసానికి చేరుకున్న డాక్టర్ రాజీవ్‌కుమార్‌కు ముఖ్యమంత్రి వైయస్ జగన్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. రెండు రోజుల పాటు ఏపీలో జరిగే వివిధ కార్యక్రమాలలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్, నీతి ఆయోగ్ బృందం పాల్గొననున్నారు.