సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన ఐఏఎస్ అధికారుల సంఘం నూతన కార్య‌ద‌ర్శం

7 Dec, 2021 09:33 IST

 
తాడేప‌ల్లి: ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ను ఐఏఎస్‌ అధికారుల సంఘం నూతన కార్యవర్గం మర్యాదపూర్వకంగా కలిసింది. సీఎంని కలిసిన వారిలో ఉపాధ్యక్షుడిగా గెలుపొందిన అహ్మద్‌ బాబు, జనరల్‌ సెక్రటరీ పీఎస్‌.ప్రద్యుమ్న, జాయింట్‌ సెక్రటరీ జే.నివాస్, కోశాధికారి ముత్యాలరాజు, కార్యవర్గ సభ్యులు రంజిత్‌ బాషా, వినోద్‌ కుమార్, మాధవీలత ఉన్నారు.