వైయస్ఆర్‌సీపీ ఘన విజయం ఖాయం
నెల్లూరు: వైయస్ఆర్‌సీపీ తరఫున పోటీ చేస్తున్న తనతో పాటు ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు ఘన విజయం సాధించడం ఖాయమని నెల్లూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సీతారామపురం మాజీ ఎంపీపీ కల్లూరి జనార్దన్ రెడ్డి వైయస్ఆర్‌సీపీలో చేరారు. ఆయనకు విజయసాయిరెడ్డి కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలతో ఎక్కడికి వెళ్లినా మంచి ప్రజాదరణ లభిస్తోందన్నారు. జనం మళ్లీ వైయస్ జగన్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. పార్లమెంటు నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఎదురొచ్చి సాదరంగా స్వాగతిస్తున్నారని తెలిపా రు. గత టీడీపీ ప్రభుత్వంలో ఏవిధమైన లబ్ధి పొందని ప్రజానీకం, ప్రస్తుత ప్రభుత్వంలో తాము రూ.లక్షల్లో పొందిన లబ్ధిని వారే వివరిస్తున్నారన్నారు. 2014 ఎన్నికల్లో నోటికొచ్చిన హామీలిచ్చి తీరా అధికారం చేపట్టాక వాటిని గాలికొదిలేశారని, దానితో ఇప్పుడు ఎన్ని హామీ లిచ్చినా నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. సీఎం వైయస్ జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాల ప్రభావంతో రాష్ట్రంలో 175 ఎమ్మెల్యే స్థానాలు, 25 ఎంపీ స్థానాలు వైయస్ఆర్‌సీపీ గెలుస్తుందన్నారు.