సీఎం వైయస్ జగన్‌కు ద్రోహం చేయాలనుకుంటే రాజకీయ భవిష్యత్తు ఉండదు
4 Feb, 2023 12:42 IST
అమరావతి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి ద్రోహం చేయాలనుకుంటే రాజకీయ భవిష్యత్తు ఉండదు అంటూ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు ద్రోహం చేసిన వాళ్లు మనుగడ సాగించలేరు. సీఎం వైయస్ జగన్ భిక్షతో గెలిచిన వారు ఎవరైనా ద్రోహం చేయాలనుకుంటే రాజకీయ భవిష్యత్తు ఉండదన్నారు. వైయస్ జగన్ ఫొటో లేకుండా మీరు గెలిచారా?. చంద్రబాబు ఉచ్చులో పడితే మీ రాజకీయ భవిష్యత్తు శూన్యం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.