వావీ వరసలు లేవా..‘నారాయణ’

29 Jul, 2023 14:54 IST

ఢిల్లీ: ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత పొంగూరు నారాయణ వేధింపుల పర్వంపై వైయ‌స్ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి స్పందించారు.  వావీ వరసలు లేకుండా సొంత కుటుంబసభ్యులనే కాదు.. ప్రజల్ని, చివరికి తన సంస్థల్లో పనిచేసే మహిళా ఉద్యోగులు, చదువుకుంటున్నమైనర్ బాలికలను కూడా ఇలానే వేధిస్తున్నారని ట్విటర్‌ వేదికగా నారాయణపై విజయసాయిరెడ్డి మండిపడ్డారు.  

గద్దలు, డేగలు కోడి పిల్లల్ని తన్నుకుపోవడానికి పైనుంచి గురి చూసినట్లే అమాయక అబలలపై కన్నేసి వారిని ఖతం చేస్తున్నారు...నారాయణ! నారాయణ! నారాయణ! అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.