సీఎం వైయస్ జగన్‌ను కలిసిన నాబార్డు చైర్మన్
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డితో నాబార్డు చైర్మన్ జి.ఆర్.చింతల భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను నాబార్డు చైర్మన్ చింతల మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జి.ఆర్.చింతలను సీఎం ఘనంగా సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. అనంతరం నాబార్డు ఆర్థిక సహాయంతో జరుగుతున్న కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షకు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కురసాల కన్నబాబు, చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్, ఎంపీ వల్లభనేని బాలశౌరి, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, సహకార శాఖ స్పెషల్ సెక్రటరీ వై. మధుసూదన్‌రెడ్డి, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, మహిళా, శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ కృతికా శుక్లా, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.