జపాన్ అవార్డు గ్రహిత పాలగుమ్మి సాయినాథ్‌కు అభినందనలు
అమరావతి: భారత దేశ వ్యవసాయం, గ్రామీణ సమస్యలు, స్థితిగతులను ముఖ్యంగా వెలుగులోకి తేచ్చినందుకు ప్రముఖ పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్ కు జపాన్ దేశానికి చెందిన ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పురస్కారం "పుకుఒకా గ్రాండ్ ప్రైజ్ - 2021” వరించింది. అవార్డు గ్రహిత పాలగుమ్మి సాయినాథ్ కు ఏపీ అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, మహరాష్ట్రల్లో కరువు, రైతుల ఆత్మహత్యలపై పరిశోధనలు జరిపి అనేక వ్యాసాలు రాసి గ్రామీణ అభివృద్ధి కోసం నిరంతర కృషి చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ సభ్యులైన పాలగుమ్మి సాయినాథ్ ప్రతిష్టాత్మక జపాన్ పురస్కారము అందుకుంటున్న సందర్భంగా వారికి వ్యవసాయ మిషన్ తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. వారికి అవార్డు రూపకంగా లభించే నగదు పురస్కారం రూ.30 లక్షలు కూడా గ్రామీణ పాత్రీకేయుల కుటుంబాలకు విరాళంగా ప్రకటించడం హర్షణీయం, అభినందనీయమని ఎంవీఎస్ నాగిరెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.