నా రాజకీయ నడక వైయస్ జగన్ వెంటే
5 Jun, 2024 15:36 IST
కాకినాడ: తన రాజకీయ నడక వైయస్ జగన్ మోహన్ రెడ్డి వెంటనే అని వైయస్ఆర్‌సీపీ నాయకుడు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై విసిరిన సవాల్‌పై తాను ఓడిపోయానని ముద్రగడ పద్మనాభం అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.
‘‘ సవాల్ ప్రకారం నా పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటున్నా. దీని కోసం గెజిట్ ప్రకటన దస్త్రాలు సిద్ధం చేసుకున్నాను. నన్ను ఉప్మా పద్మనాభం అని కొందరు హేళన చేస్తున్నారు.
వైయస్ జగన్ పేదలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు. ప్రజలు ఎందుకు దీనిని స్వీకరించలేదు అనేది నా ప్రశ్న. ప్రజల కోసం కష్టపడిన వైయస్ జగన్‌ను గౌరవించకపోవడం చాలా బాధాకరమని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు పవన్ కల్యాణ్ గెలిస్తే.. తాను పేరు మార్చుకుంటానని ముద్రగడ సవాల్ విసిరిన విషయం తెలిసిందే.