కరోనా నియంత్రణపై సీఎం అనుక్షణం సమీక్షిస్తున్నారు

6 Apr, 2020 10:19 IST

విశాఖపట్నం: కరోనా వైరస్‌ నియంత్రణపై సీఎం వైయస్‌ జగన్‌ అనుక్షణం సమీక్ష చేస్తున్నారని వైయస్‌ఆర్‌ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందన్నారు. విశాఖపట్నంలో లాక్‌డౌన్‌ అమలు తీరును ఎంపీ విజయసాయిరెడ్డి పరిశీలించారు. ఈ మేరకు విశాఖలోని 34వ వార్డులో భూపేష్‌నగర్‌లో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలీసులు, స్వచ్ఛంద సంస్థల సహాయం అభినందనీయమన్నారు. పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తున్నారని, తప్పకుండా కరోనా కట్టడి అవుతుందన్నారు.