ఆ విషయం చంద్రబాబుకు తెలియనట్టుంది

25 Apr, 2020 12:40 IST


తాడేపల్లి: ట్రూనాట్ (truenat kits) కిట్స్ తోనే కరోనా వైరస్ టెస్టులు చేస్తున్న విషయం చంద్రబాబుకు తెలియనట్టుందని వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.  వాటి గురించి కొత్తగా విని ఉంటాడు. టెస్టులు మొదలైనప్పటి నుంచి ట్రూనాట్ కిట్లనే వాడుతున్నారు. కరోనా గురించి తన వద్ద సమాచారం ఉందని బిల్డప్ ఇవ్వడానికి ఇలాంటివి పేలుస్తుంటాడంటూ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.