బాబుకు ఆయన భాగస్వామికి చేతినిండా పని దొరికింది

16 Nov, 2019 14:45 IST

అమరావతి:  భవన నిర్మాణ కార్మికులకు నిజంగానే ఉపాధి పోయిందో లేదో తెలియదు కానీ, బాబుకు ఆయన భాగస్వామికి చేతినిండా పని దొరికిందని సోషల్ మీడియాలో సెటైర్లు వెల్లువెత్తుతున్నాయని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. రాంగ్ మార్చ్, ఒక్క పూట దీక్షల కోసం చేసిన ఖర్చుతో కనీసం 1000 కుటుంబాలు ఏడాదిపాటు జీవిస్తాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారని తెలిపారు. 
ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించేందుకు కీలకమైన స్థానాల్లో జనసేన డమ్మీ అభ్యర్థులను బరిలో నిలిపిందన్న విషయాన్ని వంశీ వెల్లడించాడని విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. గన్నవరంలో పవన్ సీపీఐ అభ్యర్థిని పోటీకి దింపింది చంద్రబాబు ఆదేశాల మేరకే అని కూడా వంశీ అంతఃపుర రహస్యాలు బయటపెట్టాడని వివరించారు. ఆఖరికి జనసేన అభ్యర్థుల బి-ఫారాలు సైతం టీడీపీ ద్వారానే వెళ్లినట్టు తెలిసిందని విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Read Also: అన్యమత ప్రచార ఆరోపణలపై చర్చకు సిద్ధమా..?