అన్నా క్యాంటీన్లు అద్దె భవనాల్లో పెట్టుకోండి!
10 Jun, 2022 17:15 IST
తాడేపల్లి: టీడీపీ నేతలు పబ్లిక్ స్థలాలను ఆక్రమించి అన్యా క్యాంటీన్ల పేరుతో హడావుడి చేయడాన్ని వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ఖండించారు. పబ్లిక్ స్థలాలు ఆక్రమించి రచ్చ చేయడం, డ్రామాలు వేయడం ఏంటి బొల్లిబాబు? సేవ చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే అద్దె భవనాల్లో అన్న క్యాంటీన్స్ పెట్టుకోండి. రోడ్లు మీ అబ్బ జాగీరు కాదు. మీ ఇష్టానికి ఎక్కడపడితే అక్కడ టెంట్లు వేస్తామంటే ఎలా? చీప్ పబ్లిసిటీ కోసం చిల్లర వేషాలు వేయవద్దు చంద్రం అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.