ఏయూ భూములపై కన్నేసిన టీడీపీ నేత‌ల ఆటలు సాగవు

7 Mar, 2022 11:42 IST

విశాఖ‌:  ఆంధ్ర యూనివ‌ర్సిటీ భూముల‌పై క‌న్నేసిన టీడీపీ నేత‌ల ఆట‌లు సాగ‌వ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి హెచ్చ‌రించారు. ఈ మేర‌కు సోమ‌వారం ఆయ‌న ట్వీట్ చేశారు. AUపై నారా లోకేష్ , టీడీపీ దాడి విశాఖలో గీతం వర్సిటీకి లబ్ది చేకూర్చడానికే. ఆంధ్రా యూనివర్సిటీని దెయ్యాలకొంప అన్నది ఆ వర్సిటీ వ్యవస్థాపకుడు, లోకేష్ సమీపబంధువు. ఇప్పుడు అతని వారసులు చెలరేగి ప్రజా యూనివర్సిటీని నాశనం చేయాలనుకుంటున్నారు. ఏయూ భూములపై కన్నేసిన వీరి ఆటలు సాగవంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు.