ప్రగతి చక్రాలిక జగన్నాథ రథచక్రాల్లా పరుగులు పెడతాయి

4 Sep, 2019 11:09 IST

అమరావతి: నష్టాల్లో ఉన్న ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో కలపడం సీఎం వైయస్ జగన్ మోహన్‌ రెడ్డి చేసిన ఎంతో మంచిపనని, చంద్రబాబు దాన్ని కూడా రాజకీయం చేసే ఆలోచనలో ఉన్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "ఆర్టీసిని విలీనం చేసి 60 వేల మంది ఉద్యోగులను గవర్నమెంటులోకి తీసుకోవడం కొడిగడుతున్న దీపానికి ప్రాణం పోశారు వైయస్‌ జగన్ గారు. ప్రగతి చక్రాలిక జగన్నాథ రథచక్రాల్లా పరుగులు పెడతాయి. రాష్ట్రాన్ని దివాలా తీయిస్తారా అని మాత్రం రెచ్చిపోకండి చంద్రబాబునాయుడు గారూ. నవ్వుతారు" అని వ్యాఖ్యానించారు.