ఏడిస్తే జనం నమ్ముతారా చంబా అన్నయ్యా!
2 Sep, 2022 13:08 IST
తాడేపల్లి: టీడీపీ ఎన్‌డీఏలో చేరుతున్నట్లు ప్రచారం చేసిందీ, ముహుర్తాలు పెట్టిందీ మన పచ్చ కుల ఛానెళ్లు, పేపర్లే. ఇప్పుడు వాళ్లనే అడగమని అంటావేమిటి బాబూ? పొత్తుల కోసం పాకులాడుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసం వ్యక్తిగతంగా నష్టపోయానని ఏడిస్తే జనం నమ్ముతారా చంబా అన్నయ్యా! అంటూ వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
బల్క్ డ్రగ్ పార్క్ వస్తే ఉపాధి దొరికి యువత స్వతంత్రులవుతారన్నది టీడీపీ ఏడుపు. కేంద్రం వేయి కోట్ల గ్రాంట్ ఇస్తుంది. ఎన్టీఆర్ వెన్నుపోటుకు కత్తి అందించిన దుర్మార్గపు యనమల సొంత జిల్లా గొంతు కోస్తున్నాడు. బల్క్ డ్రగ్ కేపిటల్ గా ప్రసిద్ధి చెందిన హైదరాబాద్ కాలుష్యమయం అయిపోయిందా మలమల? అంటూ విజయసాయిరెడ్డి అంతకు ముందు మరో ట్వీట్ చేశారు.