కులం, మతం, దేవుళ్ల పేరుతో తప్పుడు ప్రచారం చేస్తూ విపక్షాల టైం పాస్
29 Aug, 2022 11:30 IST
తాడేపల్లి: విఘ్నాలను తొలగించే వినాయకుడి మండపాలు, పందిళ్ల విషయంలో ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు పెట్టకపోయినా బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. కులం, మతం, దేవుళ్ల పేరుతో తప్పుడు ప్రచారం చేస్తూ విపక్షాల టైం పాస్. కులమతాల కుంపటి రాజెయ్యాలనుకుంటే జనం మిమ్మల్ని అసహ్యించుకుంటారు. ప్రజలు కలిసిమెలిసి సంతోషంగా ఉంటే మీకెందుకు కంటగింపు? అంటూ విజయసాయిరెడ్డి సోమవారం ట్వీట్ చేశారు.