శ్రీ రాముడికి సీతమ్మ తల్లి లాగా..
9 Dec, 2021 10:24 IST
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి సతీమణి శ్రీమతి వైయస్ భారతి గారికి పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్టీ పార్లమెంటరీ నేత వి.విజయసాయిరెడ్డి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ట్వీట్ చేశారు. శ్రీ రాముడికి సీతమ్మ తల్లి లాగా జగన్ గారికి ప్రతి అడుగులోనూ తోడుగా నిలుస్తున్న వైఎస్ భారతి గారు మరెన్నో మధురమైన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా...అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. అలాగే సోషల్ మీడియా వేదికగా వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వైయస్ భారతి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టులు, గ్రీటింగ్ కార్డులు షేర్ చేశారు.