టీడీపీ నేతలు ప్రజాకంటకులు
20 Mar, 2020 15:12 IST
తాడేపల్లి: తెలుగు దేశం పార్టీ నేతలు ప్రజకంటకులని, వారి వల్ల ఏం ప్రయోజనం, అనవసర ఖర్చులు తప్ప అంటూ వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వాయిదాపడిన స్థానిక ఎన్నికలను కేంద్ర బలగాల సాయంతో నిర్వహించాలంటూ టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు చేసిన డిమాండ్‌పై విజయసాయిరెడ్డి స్పందించారు. స్థానిక సంస్థల ఎన్నికలు కేంద్ర బలగాల పహారాలో నిర్వహించాలంటూ యనమల గారు డిమాండ్ చేయడం చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని విజయసాయి ఎద్దేవా చేశారు. సీబీఐని నిషేధించినవాళ్లు, కేంద్ర బలగాలకు వ్యతిరేకంగా మాట్లాడినవాళ్లు ఇప్పుడు నాలుక మడతేస్తున్నారు అంటూ విమర్శించారు.