చంద్రబాబు పచ్చ ముఠాకిది ఆఖరి పోరాటం
10 Mar, 2020 11:48 IST
తాడేపల్లి: చంద్రబాబు పచ్చ ముఠాకు స్థానిక సంస్థల ఎన్నికలు అఖరి పోరాటమని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ రాష్ట్రంలో తీసుకొచ్చిన ఎన్నికల సంస్కరణలను దేశమంతా గమనిస్తోందని ఆయన తెలిపారు. అయితే, దీన్ని చంద్రబాబు స్వాగతిస్తారా? లేక పారిపోతారా? అన్న విషయాన్ని ఆయనే తేల్చుకోవాలని సూచించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
వైయస్‌ఆర్‌సీపీ సైనికులు అప్రమత్తంగా ఉండాలి:
సీఎం వైయస్ జగన్‌పై బురద చల్లడానికి టీడీపీ నేతలు దేనికైనా తెగిస్తారని, ఎల్లోమీడియా గోతికాడి నక్కలాగా ఎదురు చూస్తోందన్నారు. చంద్రబాబే డబ్బు, మద్యం పంపిణీ చేసి మన మీద నెడతారని వైయస్‌ఆర్‌సీపీ సైనికులు అప్రమత్తంగా ఉండాలని విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు.