వారంతా టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులే

అమరావతి: అమరావతి భూముల కోసం ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు అత్యంత నీచమైన చేష్టలకు తెగబడుతున్నారని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి విమర్శించారు. మంగళవారం ట్విటర్ వేదికగా చంద్రబాబు, ఆయనకు వత్తాసు పలుకుతున్న నాయకులు, మీడియాపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని తరలించొద్దని పిలుపునిస్తే రాష్ట్రమంతా అల్లకల్లోలమవుతుందని అతిగా ఊహించుకుంటున్నాడని, ఎవరూ పట్టించుకోకపోవడంతో కారం చల్లె పెప్పర్ గ్యాంగ్‌ను వీధుల్లోకి వదిలాడన్నారు. వీరంతా టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులేనని ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు.
ఇప్పుడు బట్టలు చించుకుంటున్నారు..
‘పదవిలో ఉన్నన్నాళ్లు చంద్రబాబు ఏ సంతకం చేసినా, జీవో ఇచ్చినా, పర్యటన చేసినా ప్రతీదీ కమిషన్లు, వాటాల కోసమే. ఎల్లో మీడియా డప్పు కొడుతూ బొక్కలు బయటపడకుండా చూసేది. దోపిడీ వ్యవహారాలు ఇప్పుడు సాక్ష్యాధారాలతో వెలుగుచూస్తుంటే కులం, కక్ష అంటూ బట్టలు చించుకుంటున్నాడు’అంటూ విజయసాయిరెడ్డి మరో ట్వీట్‌లో చంద్రబాబు, ఎల్లో గ్యాంగ్‌పై దుమ్మెత్తిపోశారు.