బాబు మాజీ పిఎస్ శ్రీనివాస్ కమిట్‌మెంటుని మెచ్చుకోవాలి
               17 Feb, 2020 11:26 IST            
                     అమరావతి: చంద్రబాబు మాజీ పిఎస్ శ్రీనివాస్ కమిట్ మెంటుని మెచ్చుకోవాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. యజమాని ప్రతి లావాదేవీనీ డైరీలో రాసుకున్నాడు. కంప్యూటర్లో నిక్షిప్తం చేసాడు. ఇంకా అప్పగించాల్సిన పద్దులను అలాగే దాచి ఉంచాడు. దోచుకున్నవి, దొంగదారుల్లో పంపిన లెక్కలన్నిటినీ ఫర్పెక్ట్‌గా రికార్డు చేసాడు’ అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.
మరో ట్వీట్‌లో ఇదే అంశంపై స్పందించిన విజయసాయిరెడ్డి..‘ఇంత బతుకు బతికి ఇంటెనక... అన్నట్లుగా ఉంది చంద్రబాబు పరిస్థితి అని ఎద్దేవా చేశారు. తన దోపిడీ వ్యవహారాల గుట్టంతా మాజీ పిఎస్ శ్రీనివాస్ వద్ద ఉన్నట్టు ఐటి దాడుల తర్వాత క్లియర్ గా అర్థమైంది. మ్యానిపులేషన్లతో వ్యవస్థలను చెరబట్టిన వ్యక్తి చివరకు శ్రీనివాస్ అనే ఉద్యోగి దగ్గర తన ‘పాస్ వర్డ్’ వదిలేశాడు’ అని విమర్శించారు. ‘