‘చంద్రబాబు మైండ్‌లో వైబ్రేషన్స్ పెరిగాయి’
6 Feb, 2020 12:03 IST
అమరావతి: మూడు రాజధానుల అంశంపై ప్రతిపక్షనేత చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై కూడా విమర్శలు చేస్తున్నారని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ‘రాజధాని ఎక్కడుండాలనే విషయంపై కేంద్రం క్లారిటీ ఇచ్చినప్పటి నుంచి చంద్రబాబు మైండ్‌లో వైబ్రేషన్స్ పెరిగాయి. కేంద్ర ప్రభుత్వంపైనా రుసురుసలాడుతున్నాడు. రాజధాని పెట్టడం వరకే రాష్ట్రం ఇష్టమట. మార్చే అధికారం లేదంట. ఇంకా ఏమేం రూల్సున్నాయో ఒకేసారి చెప్పేయండి విజనరీ!’ అని విజయసాయిరెడ్డి ట్విట్ చేశారు.