అందుకే అప్పట్లో యనమలని స్పీకర్ గా చేశాడు

24 Jan, 2020 11:55 IST

అమరావతి:  టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ స్పీకర్‌ యనమల రామకృష్ణుడులపై వైయస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచే ప్రణాళికలో భాగంగా అప్పట్లో యనమలని చంద్రబాబు స్పీకర్ గా తెరపైకి తీసుకొచ్చాడని, అటు యనమల కూడా తన బాస్ ముఖ్యమంత్రి కావడానికి స్పీకర్ స్థానంలో ఉండి సహకరించాడని ఆరోపించారు. అంతేకాకుండా బాబు చరిత్రలో నిల్చేంతగా సేవ చేశారని విమర్శించారు. ఇప్పుడు శాసనమండలి ప్రతిష్ఠను కూడా చంద్రబాబు తన స్వార్థం కోసం మంటగలిపారని మండిపడ్డారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.