లోకేష్‌కు ఓటమి తప్పదని టీడీపీకి ముందే తెలుసు..
19 Jun, 2019 12:39 IST
అమరావతి: ఓటమి తప్పదని గ్రహించే లోకేష్‌తో ఎమ్మెల్సీకి రాజీనామా చేయించలేదని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.రాజీనామా చేయించకుండానే మంగళగిరి నుంచి బరిలో దింపారని ట్విట్ చేశారు.ఎన్నికలకు ముందే తమ వాళ్లకు పోస్టింగులు,ప్రమోషన్లు ఇచ్చారన్నారు.పోలింగ్ తర్వాత అప్పులు తెచ్చి మరీ కాంట్రాక్టర్ల బిల్లు చెల్లించారన్నారు.ఇప్పడేమో ఓటమికి కారణాలు తెలియదంటూ నంగనాచి డ్రామాలు ఆడుతున్నారని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.