ఊసరవెల్లిని మించిపోయావయ్యా చంద్రం!
30 Jan, 2021 11:19 IST
న్యూఢిల్లీ: టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా..ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడుతూ ఊసరవెళ్లి రాజకీయాలు చేస్తున్నారని వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి విమర్శించారు. ఈ మేరకు శనివారం ఆయన ట్వీట్ చేశారు. ఏ రోటికాడ ఆ పాట - ఏ ఎండకాగొడుగు పట్టడమంటే ఇదే. డీజీపీకి అప్పటి గవర్నర్ ఫోన్ చేస్తేనే తాను సీఎంగా ఉన్నప్పుడు చిందులేశాడు. ఇప్పుడేమో ఉద్యోగులను గవర్నర్ నియంత్రించాలట? మాట మార్చడంలో ఊసరవెల్లిని మించిపోయావయ్యా చంద్రం.. అంటూ ట్వీట్ చేశారు.