రెండున్నరేళ్లుగా బాబు డైరెక్షన్ ఇవ్వలేదని నిమగడ్డ నిద్రపోయాడు
28 Jan, 2021 10:45 IST
విజయవాడ: 2018వ సంవత్సరంలో నిర్వహించాల్సిన పంచాయతీ ఎన్నికలు చంద్రబాబు డైరెక్షన్ ఇవ్వలేదని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్వహించలేదని వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన ట్వీట్ చేశారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపాలని 2018లోనే హైకోర్టు ఆదేశించినా నిమ్మగడ్డ పట్టించుకోలేదు. ఉమ్మడి రాష్ట్రంలో 2013లో ఆఖరిసారి ఎన్నికలు జరిగాయి. రెండున్నరేళ్లుగా బాబు డైరెక్షన్ ఇవ్వలేదని నిమగడ్డ నిద్రపోయాడు. ఇప్పుడు కరోనా టైంలో ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నాడు.
ఎవరు మిమ్మల్ని నమ్మినా, నమ్మకపోయినా సరే, మీరు నమ్మితే చాలు.... విజయం మిమ్మల్ని వరిస్తుందంటూ అంతకు ముందు చేసిన ట్వీట్‌లో విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.