సీఎం వైయస్ జగన్ చర్యలతో 6 లక్షల ఎకరాలకు సాగునీరు
27 Jan, 2021 14:49 IST
విజయవాడ: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చర్యలతో 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. తుంగభద్ర కాలువల్లో జల చౌర్యాన్ని అడ్డుకునేందుకు సిఎం వైయస్ జగన్ గారు ఏర్పాటు చేయించిన టెలిమెట్రి పరికరాల వల్ల కడప, కర్నూలు, అనంత లోని 6 లక్షల ఎకరాలకు నీరు అందుతోంది. HLC, LLC కాల్వలకు 54 టిఎంసీల కేటాయింపు ఉన్నా దశాబ్దాలుగా సగం నీరు కూడా రాని పరిస్థితి. ఇప్పుడా సమస్య పరిష్కారమైందని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.