దొంగే దొంగ అని అరవడం మీకు కొత్తకాదు గదా బాబూ?
25 Feb, 2022 11:05 IST
న్యూఢిల్లీ: జాతీయ ఉపాధి హామీ పథకంలో అవినీతి జరిగిందన్న టీడీపీ నేతల ఆరోపణలను వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. చంద్రబాబు గారు సర్పంచుల సదస్సు పెట్టింది ప్రభుత్వాన్ని ఎలా బ్లాక్ మెయిల్ చేయొచ్చో నేర్పించడానికా? మీ హయాంలో ఉపాధి హమీ పనుల దోపిడీ వివరాలు కేంద్రం దగ్గర ఉన్నాయి. దొంగే దొంగ అని అరవడం కొత్తకాదు గదా మీకు. ‘నరేగా’లో 7 వేల కోట్ల అవినీతి జరిగితే ఫిర్యాదు చేయకుండా ఎవరు ఆపారు మిమ్మల్ని? అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు.