పిచ్చాసుపత్రిలో ఉండాల్సిన పార్టీ..టీడీపీ
23 Feb, 2022 12:15 IST
విశాఖ: మంత్రి గౌతమ్ రెడ్డి మరణంపై తప్పుడు ఆరోపణలు చేసిన టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు బుధవారం విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఒక నాయకుడు మరణిస్తే హుందాగా నివాళులు అర్పించాల్సింది పోయి...నీచమైన కామెంట్స్ చేయడం TDP నేతలకే సాధ్యం. ఆ పార్టీ సీనియర్ నాయకుడు బండారు సత్యనారాయణ మూర్తి మాటలు వింటే...TDP మానసిక వైకల్యం అర్ధమవుతుంది. పిచ్చాసుపత్రిలో ఉండాల్సిన పార్టీ - RIP Vizag TDP అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు.