Babu mark of bankrupt politics ఇలాగే ఉంటాయి

20 Jan, 2021 16:12 IST

న్యూఢిల్లీ: ప‌్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నిజ స్వ‌రూపాన్ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా ఎండ‌గ‌ట్టారు. వెన్నుపోటు పొడిచి ప్రాణం తీసిన వారే గజ మాలలు వేసి శోకాలు నటిస్తారు. ప్రజాధనాన్ని డెకాయిట్ల లాగా లూటీ చేసిన వారే ‘దొంగ దొంగ’ అని అరుస్తారు. గుళ్లు కూల్చిన వారే  అపచారం...అపచారం అని గొంతు చించుకుంటారు. Babu mark of bankrupt politics ఇలాగే ఉంటాయి అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

అంత‌కుముందు మ‌రో ట్వీట్‌లో ..18.8 కిమీ వెలిగొండ ఒకటో టన్నెల్ తవ్వకం పూర్తయింది. మహానేత డా.వైయ‌స్ఆర్ ప్రారంభించిన పనులు సీఎం వైయ‌స్‌ జగన్ గారు వచ్చాక వేగం పుంజుకున్నాయి. 43.5 టిఎంసీల వెలిగొండ పూర్తయితే ప్రకాశం,నెల్లూరు,కడప మెట్ట భూములకు సాగునీరు అందుతుంది. బాబు పాలనలో టన్నెల్ పనులు కేవలం 0.6 కిమీ మాత్రమే జరిగాయి అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు.