పచ్చ మీడియా గొంతుపెగలడం లేదు
18 Jan, 2021 11:49 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి దేశంలో అత్యుత్తమ సీఎంల జాబితాలో మూడో స్థానంలో నిలిచారని..ఈ విషయంలో పచ్చ మీడియా గొంతు పెగలడం లేదని వైయస్ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. అప్పట్లో అడ్రసులేని సంస్థల నుంచి ఏవేవో అవార్డులొచ్చేవి బాబుకి. ఎల్లో మీడియా అహో... ఒహో అని ఎలివేషన్లిచ్చేది. కొనుక్కున్న అవార్డులన్న సంగతి బయటికి రాకుండా ప్రచారం హోరు సాగేది. ABP, సి-వోటర్ సర్వే జగన్ గారిని మూడో అత్యుత్తమ సిఎంగా గుర్తిస్తే పచ్చ మీడియా గొంతుపెగలడం లేదు అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.