కాకిలెక్కలు మాని గెలిచిన పేర్లైనా ప్రకటించగలరా?
విశాఖ: గెలిచింది 39.52 శాతం పంచాయతీలా లేక 39 చోట్లా? మీ ఎమ్మెల్యేలున్న ఎక్కడైనా 10 శాతం పంచాయతీలు గెలిచారా బాబూ? ఎన్నికల తర్వాత వైయస్ఆర్‌సీపీ కండువాతో అభిమానుల జాబితాను మేం విడుదల చేస్తున్నాం. కాకిలెక్కలు మాని గెలిచిన మీ మద్దతుదారుల పేర్లైనా ప్రకటించగలరా? అంటూ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.
సీఎంగారి దూరదృష్టి వల్ల ఏపీఎస్ ఆర్‌టీసీ గాడిన పడింది. దాదాపు 15 ఏళ్ల తర్వాత లాభాల్లోకొచ్చింది. చంద్రబాబు అధికారంలో ఉండగా ఆర్టీసీని తన వారికి కట్టబెట్టేందుకు ప్రయత్నించాడు. సీఎం వైయస్ జగన్ గారు ప్రభుత్వంలో విలీనం చేసి - మాట నిలబెట్టుకున్నారు. ఒక్క ప్రభుత్వ సంస్థనైనా ఇలా నిలబెట్టావా చంద్రబాబూ? అంటూ మరో ట్వీట్ చేశారు.
టీడీపీ ఇంకా బ్రతికే ఉందని చెప్పేందుకు భ్రమ రాజకీయాలు చేస్తున్నాడు చంద్రబాబు. పచ్చ కుల మీడియాలో ఫేక్ న్యూస్ వేయించినంత మాత్రాన పంచాయతీలు గెలిచినట్లా? మీ భార్య దత్తత తీసుకున్న కొమరవోలులో టీడీపీ బలపరిచిన అభ్యర్థి ఓడారు. నీ జిల్లా, మీ అత్త గారి జిల్లాలోనూ వైయస్ఆర్‌సీపీ ప్రభంజనమే బాబూ అంటూ విజయసాయిరెడ్డి అంతకుముందు చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు.