తొందరెందుకు..ఆ సరదా కూడా తీర్చుకుందురు!
12 Dec, 2020 11:26 IST
తాడేపల్లి: ప్రతిపక్ష నేత చంద్రబాబు భ్రమల్లో ఉన్నారని, ప్రజలు మాత్రం పిచ్చి క్లారిటీతో ఉన్నారని వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఇటీవల నిర్వహించిన జీహెచ్ఎంసీ ఎన్నికలలో ‘ఇరగదీసిన’ తర్వాత తిరుపతి గెలుపు కోసం సిద్ధంగా ఉండాలని బాబు కార్యకర్తలకు కనుసైగ చేస్తున్నారు. ప్రజలు వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి దూరమయ్యారట. మానసిక రుగ్మతల వల్ల మీరు భ్రమల్లో ఉన్నా జనం మాత్రం పిచ్చ క్లారిటీతో ఉన్నారు. తొందరెందుకు. ఆ సరదా కూడా తీర్చుకుందురు అంటూ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.