కార్పోరేట్ స్థాయికి ప్రభుత్వ వైద్యం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా వైద్యానికి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పెద్ద పీట వేశారని వైయస్ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ట్వీట్ చేశారు. ప్రజారోగ్యం పట్ల సిఎం వైయస్ జగన్ గారు తీసుకుంటున్న శ్రద్ధ ఇంకే రాష్ట్రంలో కనిపించదు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనా చికిత్సను తీసుకురావడమే పెద్ద సాహసం. మరో 234 జబ్బులను చేర్చారు.108,104 సేవలకు ప్రాణం పోశారు. వచ్చే మూడున్నరేళ్లలో కార్పోరేట్ స్థాయికి తీసుకెళ్తారు ప్రభుత్వ వైద్యాన్ని అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
ప్రజలు దేవుడిగా ఆరాధిస్తున్నారు..
ఎల్లో మీడియా ప్రజల్లో అనుమానాలు రేకిత్తించే వార్తలు వదులుతుంది. ఆ పేపర్లను గాలిలో ఊపుతూ బాబు శిష్యగణమంతా ‘ఇలా అయితే ఎలా’ అని పళ్లు కొరుకుతుంది. అక్కడ ఉన్నది మాయల మరాఠీ బాబు కాదు. ప్రజలు దేవుడిగా ఆరాధిస్తున్న వైయస్ జగన్ గారు. ఏ చిన్న సమస్య తలెత్తినా మొదట తనే స్పందిస్తారు అంటూ విజయసాయిరెడ్డి అంతకుముందు మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.