మూడు వ్యవసాయ బిల్లులపై ఒక్క సవరణైనా సూచించావా బాబూ?
8 Dec, 2020 10:33 IST
విజయవాడ: వ్యవసాయ బిల్లులపై చంద్రబాబు మారు మాట్లాడకుండా మద్దతిచ్చాడని వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. స్వామినాథన్ కమిటీ రిపోర్టు అమలుచేయాలని, కనీస మద్దతు ధర ఉండాల్సిందేనని, వైయస్ఆర్సీపీ ఎంపీలమైన మేము పార్లమెంట్ లో గట్టిగా మాట్లాడాం. మూడు వ్యవసాయ బిల్లులపై ఒక్క సవరణైనా సూచించావా బాబూ? చంద్రబాబుకు హెరిటేజ్ ప్రయోజనాలే ఎక్కువైపోయాయంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
కాపలాదారే చోరీకి పాల్పడ్డట్టు ఉంటుంది బాబు వ్యవహారం. వందల ఎకరాల దేవాదాయ భూములను బినామీలకు రాసిచ్చాడు. ఉద్యోగుల కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సొమ్ము 663 కోట్లను పసుపు-కుంకుమల కోసం మళ్లించాడు. అను’కుల మీడియా ‘జయము జయము చంద్రన్నా’ అంటూ జాకీలు పెట్టి లేపుతూనే ఉందని అంతకు ముందు ట్విట్లో విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.