అను 'కుల మీడియా ద్వారా అసత్యాలు ప్రసారం
7 Dec, 2020 11:32 IST
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు జూమ్ యాప్ ద్వారా సమావేశాలు జరుపుతూ, తన అను 'కుల మీడియా ద్వారా అసత్యాలు ప్రసారం చేస్తున్నప్పటికీ ఆయన చెప్పే మాటలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
‘జూమ్ మీటింగులకు అలవాటు పడిన ప్రతిపక్షనేత అసెంబ్లీ సమావేశాల్లో లోపలి కంటే బయటే ఎక్కువ గడిపాడు. అను ‘కుల మీడియా కొంగు చాటున దాక్కునే రోజులు పోయాయి. పాలు, నీళ్లను వేరు చేసి చూపే సోషల్ మీడియా ప్రభావశీల ప్రత్యామ్నాయంగా అవతరించిన తర్వాత కట్టు కథలు చెప్పి అడ్డంగా దొరికిపోతున్నాడు’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.