ఎన్ని చేసినా నువ్వు రావణాసురునివే బాబూ?
4 Jan, 2021 10:49 IST
తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మతాల మధ్య మారణహోమం సృష్టించాలని కుట్రలు చేస్తున్నారని వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు రామతీర్థంకు వెళ్లినప్పటి ఫొటోను పోస్ట్ చేస్తూ విజయసాయిరెడ్డి ట్వీట చేశారు.
'శ్రీరాముని విగ్రహన్ని మీరు.. మీ గ్యాంగ్ ధ్వంసం చేసి ఆ విక్టరీ సింబల్ చూపిస్తూ పర్యటనలేంటి బాబూ? రామతీర్థం రామునితో రాజకీయాలు చేస్తావా? ఎన్ని చేసినా నువ్వు రావణాసురునివే. జనం చీదరించుకోవడంతో ఇప్పుడు మతాల మధ్య మారణహోమం సృష్టించాలని అనుకుంటున్నావా?' అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.